లాక్ డౌన్ పై నిర్ణయం..మే5న తెలంగాణ కేబినెట్

Update: 2020-04-30 15:31 GMT

తెలంగాణ మంత్రివర్గం ఈ నెల5న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నాం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణలో లాక్ డౌన్ ను మే 7 వరకూ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటిస్తుండటంతో ఖచ్చితంగా లాక్ డౌన్ నుంచి ప్రజలకు ఊరట లభించటం ఖాయంగానే కన్పిస్తోంది. అయితే ఈ ఊరట ఏ మేరకు ఉంటుంది..అత్యంత కీలకమైన హైదరాబాద్ నగరంలో ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది. పాక్షిక వెసులుబాటే దక్కుతుందా? అన్న అంశం మంత్రివర్గ సమావేశం తర్వాత మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్రజా రవాణాకు ఇప్పటికిప్పుడు అనుమతించే అవకాశం ఉండకపోవచ్చని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంకేతాలు ఇఛ్చారు. దేశంలో లాక్ డౌన్ కూడా మే 3తో ముగియనుంది. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలోగానే కేంద్రం కూడా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందులోని అంశాలను కూడా పరిశీలించి..రాష్ట్రంలో పరిస్థితులు ఆధారంగా సర్కారు ముందుకెళ్లే అవకాశం ఉంది.

 

 

 

Similar News