కేంద్రమే వలస కూలీలను తరలించాలి

Update: 2020-04-30 12:03 GMT

ఎక్కడికి వారు అక్కడకు వెళ్లొచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకోవటం ఏ మాత్రం సరికాదని తెలంగాణ పశుసంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్యానించారు. నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ వివిధ పనుల కోసం బీహార్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వారి రాష్ట్రాలకు బస్సులలో వెళ్ళాలంటే 3 నుండి 5 రోజుల సమయం పడుతుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసి ఉచితంగా వారి రాష్ట్రాలకు చేర్చే బాద్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. వలస కోలీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బస్సులలో తరలించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం తగదన్నారు. రైళ్ళలో వలస కూలీలను వారి రాష్ట్రాలకు చేర్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బస్సులలో కూలీల స్వగ్రామాలకు చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.

 

 

 

Similar News