ఏపీలో కరోనా కేసుల స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒక్క బుధవారం రోజే రాష్ట్రంలో 34 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో 15 కేసులు రాగా..సాయంత్రం మరో 19 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 348కి పెరిగింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి ఆరు వరకూ వెల్లడైన కేసుల్లో గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశంలో 3, పశ్చిమ గోదావరిలో ఒక్క కేసు నమోదు అయ్యాయి. విశాఖపట్నంలో ముగ్గురు పేషంట్లు రికవరి అయి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 9కి చేరింది.