కరోనాపై పోరుకు రామ్ కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేసింది. ఈ మొత్తాన్ని బుధవారం నాడు ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం గౌతమ్ రెడ్డి అందజేశారు. ఐదు కోట్లలో మూడు కోట్ల రూపాయలను చెక్కు రూపంలో అందించగా, మిగిలిన రెండు కోట్ల రూపాయల విలువైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ)లను సరఫరా చేయనున్నారు.
ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ " కరోనావైరస్ మహమ్మారి కారణంగా కోట్లాది మంది జీవితాలు ప్రభావితమయ్యాయన్నారు. కనిపించని ఈ శత్రువుతో పోరాడటానికి అందరూ కలిసికట్టుగా రావాల్సి ఉందని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్న స్థానిక ప్రభుత్వాలకు మద్దతునందించాలనే రీల్ యొక్క ప్రస్తుత ప్రయత్నాలకు తాజా ఉదాహరణగా ఈ తోడ్పాటునిలుస్తుంది.