కరోనాపై ‘వర్మ పాట వచ్చేసింది’

Update: 2020-04-01 15:59 GMT

కరోనాపై వరస పెట్టి పాటలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఓ పాటను, వందేమాతరం శ్రీనివాస్ ఓ పాటను విడుదల చేయగా..ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వంతు వచ్చింది. ‘నలిపేద్దామంటే అంత సైజు లేదు దానికి. పచ్చడి చేద్దామంటే కండలేదు దానికి. అదే దాని బలం..అదే దాని దమ్ము.

అది నీచమైన పురుగు..అయినా మంచే జరుగు ’ అంటూ వర్మ ఓ పాటను విడుదల చేశారు. బుధవారం సాయంత్రం ఈ పూర్తి పాటను వర్మ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. శాండీ అడ్డంకి ఈ పాటకు సంగీతం అందించారు. పాట ద్వారా కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వర్మ చెప్పారు.

https://www.youtube.com/watch?v=EFzOA0-jfOo

Similar News