వైద్యులకు సర్కారు భరోసా ఇవ్వాలి

Update: 2020-04-07 13:48 GMT

కరోనాపై పోరులో నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భద్రత కల్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) సూచించిన విధంగా కరోనా విధుల్లో ఉన్నవారికి పీపీఈలు సమకూర్చాలని కోరారు. ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే మెరుగైన సమాజం ఏర్పాటు అవుతుందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

వైద్యులు, అనుబంధ సిబ్బంది సేవలు సాహసోపేతమైనవి అని పవన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పవన్ అభినందనలు తెలిపారు. నిత్యం రోగుల సేవలో ఉండే నర్సులు, ప్రసూతి ఆయాలకు ఆర్ధిక పరిస్థితి మెరుగుపర్చటంతోపాటు..ఉద్యోగ భధ్రత కోసం చట్టం చేయాలని పవన్ కోరారు.

 

Similar News