కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో 487కి పెరిగింది. శుక్రవారం నాడు కొత్తగా 16 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 45 మంది డిశ్చార్జి కాగా, మరో 12 మంది చనిపోయారు. హైదరాబాద్ లోనే అత్యధికంగా 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా..ఇప్పటికే 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ తర్వాత స్థానంలో నిజామాబాద్ ఉంది. ఇక్కడ 49 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. రంగారెడ్డిలో 27, వరంగల్ అర్బన్ లో 23, మేడ్చల్ లో 21 కేసులు ఉన్నాయి.