
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఏప్రిల్ నెలాఖరు వరకూ పొడిగించాలని ఆయన అందులో కోరారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున కొన్ని ప్రాంతాలకే లాక్ డౌన్ ను పరిమితం చేయాలనే ఆలోచన ఏ మాత్రం సరికాదన్నారు. భారత్ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయని తెలిపారు.
ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడం ముఖ్యమే అయినా...ప్రజల ప్రాణాలను కాపాడటానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒడిశా లాంటి రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నాయని..ఏపీ కూడా అదే బాటలో పయనించాలని కోరారు.