ప్రభుత్వాలు బాల్కనీ నుంచి కిందకు చూడాలి

Update: 2020-04-15 07:09 GMT

దేశంలోని వలసకూలీల అంశంపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు బాల్కనీ కిందకు చూసి పరిస్థితులను మదింపు వేయాలని అన్నారు. అప్పుడే వారికి వాస్తవ పరిస్థితి అర్ధం అవుతుందని ఎద్దేవా చేశారు. వలస కూలీల సమస్య కరోనా కంటే తీవ్ర సంక్షోభంగా ఉందని అన్నారు. తాజాగా లాక్ డౌన్ మే 3 వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వలస కూలీలు రోడ్డు మీదకు వచ్చారు.

తమకు ఉపాధి దొరకటంలేదని..తిండి పెట్టేవారు కూడా లేరంటూ తమ తమ ప్రాంతాలకు వెళ్ళేందుకు అనుమతించాలని బయటకు వచ్చారు. తొలుత ఢిల్లీలో ఇలాంటి పరిస్థితి ఉండగా..తాజాగా ముంబయ్ లోనూ వేలాది మంది బయటకు వచ్చారు. ముంబయ్ ఘటనపై ట్విట్టర్ వేదికగా కమల్ హాసన్ స్పందించారు. వలస కూలీల సమస్య పెద్ద సంక్షోభంగా మారకముందే ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

 

Similar News