న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ ఫైర్

Update: 2020-04-13 10:20 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్స్ టైమ్స్ పత్రికపై మండిపడ్డారు. దేశంలోని కీలక విభాగాలు అన్నీ చాలా ముందస్తుగా కరోనా ఉపద్రవంపై హెచ్చరించినా ఆయన ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించారంటూ పత్రిక సంచలన కధనాన్ని ప్రచురించింది. ఇదే ఆయన ఆగ్రహానికి కారణమైంది. ‘‘న్యూయార్క్‌టైమ్స్‌ కథనం నకిలీది. అదొక కాగితం మాత్రమే. చైనా ప్రయాణాలపై అందరికంటే ముందే నిషేధం విధించి నేను విమర్శలు ఎదుర్కొన్నాను.

అలెక్స్‌ అజర్‌(అమెరికా హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ కార్యదర్శి) అంతవరకు నాకేమీ చెప్పలేదు. పీటర్‌ నెవారో కూడా అలాగే మాట్లాడారు. నకిలీ వార్తలు!’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో ట్రంప్ న్యూయార్స్ టైమ్స్ స్టోరీపై స్పందించారు. ఆరోగ్య శాఖతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ, నిఘా వర్గాలు ప్రాణాంతక వైరస్‌ గురించి హెచ్చరించినా ట్రంప్‌ పట్టించుకోలేదని ఆరోపించింది.

 

Similar News