ఏపీలో కొత్తగా 15 కేసులు

Update: 2020-04-09 15:42 GMT

ఆంధ్రప్రదేశ్ లో గురువారం నాడు కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యావు. ఇందులో ప్రకాశం జిల్లాలో పదకొండు ఉంటే..గుంటూరులో రెండు, తూర్పు గోదావరి, కడపల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. తాజాగా వచ్చిన 15 కేసులతో కలిపితే ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 363కి పెరిగింది.

చిత్తూరు జిల్లాలో గురువారం ఓ పేషంట్ ను డిశ్చార్జ్ చేశారు. దీంతో డిశ్చార్జి అయిన వారి సంఖ్య పదికి పెరిగింది. కరోనా కారణంగా ఏపీలో గురువారం రెండు మరణాలు నమోదు అయ్యాయి. అందులో ఒకటి అనంతపురం, గుంటూరు జిల్లాలో ఒకటి ఉన్నాయని హెల్త్ బులెటిన్ లో తెలిపారు.

 

Similar News