ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలని ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. అదే సమయంలో ఆంక్షలు మాత్రం కొనసాగాంచాలని సూచించారు. ఏది ఏమైనా కేంద్రం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని..అలాగే ముందుకెళతామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ పాల్గొన్నారు.
జనం గుమిగూడకుండా మాల్స్, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలని కోరారు. మిగతా ప్రాంతాల్లో భౌతికదూరం పాటించాలన్నారు. ఏపీలో 37 మండలాలే రెడ్‌జోన్‌లో ఉన్నాయని, 44 మండలాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయని, 595 మండలాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయని మోదీకి జగన్ వివరించారు. ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలని, మీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.