కరోనా పోరులో భాగం పంచుకునేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ముందుకొచ్చింది. గురువారం నాడు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ 7.5 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించింది. దీనికి అదనంగా రూ. 3.5 కోట్ల విలువైన శానిటైజర్లు, హై ఎండ్ మెడికల్ కిట్స్, మాస్కులతో పాటు ఇతర వైద్యసామాగ్రిని పంపిణీ చేయనున్నట్టు అరబిందో ఫార్మా తెలిపింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జగన్ కు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి విరాళానికి సంబంధించిన చెక్‌ను అందజేశారు.