ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 420కి పెరిగింది. కొత్తగా ఆదివారం నాడు 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో గుంటూరులో ఏడు, నెల్లూరులో నాలుగు, కర్నూలులో రెండు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా మరో వ్యక్తి మరణించినట్లు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. మొత్తం 420 కేసుల్లో ఇఫ్పటికే 12 మంది డిశ్చార్జ్ కాగా, ఏడుగురు మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 401గా ఉంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 84 కేసులు ఉండగా, గుంటూరులో 82 కేసులు ఉన్నాయి.