ఉదయం పన్నెండు. సాయంత్రం ఏడు. వెరసి సోమవారం ఒక్క రోజులో ఏపీలో 19 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 439కి పెరిగింది. సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ జరిగిన పరీక్షల్లో గుంటూరులో మూడు, నెల్లూరులో నాలుగు కేసులు నమోదు అయ్యాయి.
మొత్తం 439 కేసుల్లో ఇఫ్పటికే 12 మంది డిశ్చార్జి అయ్యారు. ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో అనంతపురంలో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఒకరు ఉన్నారని హెల్త్ బులెటిన్ లో తెలిపారు. గుంటూరులో మొత్తం కేసుల సంఖ్య 93కు పెరిగింది. కర్నూలులో 84, నెల్లూరులో 56 కేసులు ఉన్నాయి.