ఏపీలో 500 దాటిన కరోనా కేసులు

Update: 2020-04-15 07:11 GMT

కరోనా కేసులు ఏపీలో 500 మార్క్ ను దాటేశాయి. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ వెల్లడైన ఫలితాల్లో కొత్తగా 19 కేసులు వెలుగుచూశాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 502కు పెరిగింది. కొత్తగా పశ్చిమ గోదావరిలో ఎనిమిది, కర్నూలులో ఆరు, గుంటూరులో నాలుగు, కృష్ణా జిల్లాలో ఒక్క కేసు నమోదు అయ్యాయి. మొత్తం 502 కేసుల్లో పదహారు మంది డిశ్చార్జ్ అయితే..పదకొండు మంది మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం అత్యధికంగా 118 కేసులు ఉన్నాయి. కర్నూలులో కేసుల సంఖ్య 97కు పెరగ్గా, నెల్లూరులో 56 కేసులు ఉన్నాయి.

 

Similar News