జగన్ వి నియంత లక్షణాలు

Update: 2020-03-02 08:31 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ చరిత్రలో ఎవరితోనూ పోల్చలేమని..తుగ్లక్, హిట్లర్, ముస్సోలిని, నీరో కలిస్తే ఎలా ఉంటుందో సీఎం జగన్ అలా ఉన్నారని యనమల రామకృష్ణుడు విమర్శించారు. నియంతలకు ఉన్న అన్ని లక్షణాలు జగన్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్రం నాశనం అవుతున్నా జగన్ తనకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రం తగలబడుతుంటే జగన్ ఇంట్లో కూర్చుని అనందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 48 శాతం రెవెన్యూ పడిపోయిందని.. సలహాదారులపై ఎందుకు అనవసర ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.

సలహాదారులు మంచి చెప్పినా జగన్ వినే పరిస్థితి లేదని యనమల విమర్శించారు. జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బిల్లులను సెలక్ట్ కమిటీలకు వెళ్ళకుండా అడ్డుకోవటం ఏ మాత్రం సరికాదన్నారు. ఇలాంటి నిర్ణయాలే మళ్ళీ తీసుకుంటే తాము అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఆషామాషీగా వ్యవహరించటం సరికాదన్నారు.

Similar News