
ఆంధ్రప్రదేశ్ లోనూ బుధవారం నాడు రెండు కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి పెరిగింది. వాషింగ్టన్ నుంచి విజయవాడ నుంచి యువకుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఢిల్లీ నుంచి వచ్చిన 52 సంవత్సరాల వ్యక్తికి కూడా కరోనా ఉన్నట్లు తేలిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.