మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహన్

Update: 2020-03-23 15:48 GMT

మధ్యప్రదేశ్ లో బిజెపి సర్కారు కొలువుదీరింది. పక్కా వ్యూహాంతో అమలు చేసిన ప్లాన్ వర్కవుట్ కావటంతో కాంగ్రెస్ సర్కారు పతనం అయి...బిజెపి సర్కారు వచ్చింది. కొత్త సీఎంగా శివరాజ్ సింగ్ చౌహన్ సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ లాల్జీ టాండన్ ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభలో బలపరీక్షకు ముందే కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేయటంతో బిజెపి సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.

మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ నేత జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ కు రాజీనామా చేయటంతో..ఆయన వర్గం ఎమ్మెల్యేలు 22 మంది కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో కాంగ్రెస్ సర్కారు కుప్పకూలిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన వారందరికీ మళ్ళీ బిజెపి టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సి ఉంటుంది. కర్ణాటకలో ఎలా చేశారో..మధ్యప్రదేశ్ లో కూడా బిజెపి అచ్చం అలాగే చేసింది.

Similar News