ప్రచారంలో ఉన్నదే నిజం అయింది. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ‘వకీల్ సాబ్’ అని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. అంతే కాదు..ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా సోమవారం నాడు విడుదల చేసింది. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత రీమేక్‌తో పవర్ స్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ 'ఆటో ట్రాలీలో ఓ పుస్తకం చదువుతూ.. కుర్చీలో కూర్చోని ఉండటం' ఫస్ట్ లుక్‌లో కనబడుతోంది. ఇది పవన్ నటించిన 26వ చిత్రం. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.