‘మనసా...మనసా..మనసారా బతిమాలా తన వలలో పడబోకే మనసా..పిలిచా..అరిచా అయినా నువు వినకుండా తనవైపు వెళతావే మనసా’ అంటూ సిద్ శ్రీరామ్ పాడిన పాటను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్’ సినిమాలోని లిరికల్ సాంగ్ ఇది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డె జంటగా నటిస్తున్న ఈ సినిమాలోని ఈ పాట క్లాసిక్ గా ఉంది. ఈ సినిమాపై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పూజా హెగ్డె టాలీవుడ్ లో వరస పెట్టి హిట్ సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. మరి పూజా ప్రభావం ఏమైనా ఈ సినిమాకు కలిసి వస్తుందేమో వేచిచూడాల్సిందే.
https://www.youtube.com/watch?v=NtTGqvD67pE