మంత్రులకు జగన్ హెచ్చరిక

Update: 2020-03-04 13:10 GMT

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మంత్రులకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. బుధవారం నాడు మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఎన్నికల అంశంపై మంత్రులతో జగన్ కొద్దిసేపు మాట్లాడారు. స్థానిక సంస్థల్లో గెలుపు బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యులు తీసుకోవాలన్నారు. తేడా వస్తే మంత్రి పదవులు ఊడిపోతాయని హెచ్చరించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా ఉండాలని జగన్ మంత్రులను ఆదేశించారు.

స్థానిక ఎన్నికల తర్వాతే అసెంబ్లీ సమావేశాల ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. డబ్బు, మద్యం పంపిణీ విషయంలో కఠినంగా ఉండాలన్న సీఎం. ఇందులో అధికార పార్టీకి కూడా ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. చుక్క మద్యం పంపిణీ చేసినా.. ఒక్క రూపాయి పంపిణీ చేసినా జైలుకెళ్లాల్సిందేనని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో రిజర్వేషన్లపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్లను 50 కుదిస్తూ ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు.

 

 

Similar News