సినీ కళాకారుల కోసం చిరు సాయం కోటి రూపాయలు

Update: 2020-03-26 11:44 GMT

కరోనా వైరస్ ప్రభావం టాలీవుడ్ పైన కూడా పడింది. దీంతో అన్ని సినిమాల షూటింగ్ లకు బ్రేకులు పడ్డాయి. ఇందులో చిరంజీవి సినిమా ‘ఆచార్య’ కూడా ఉంది. ఈ తరుణంలో పనిలేకుండా జీవనం సాగించటం కష్టంగా మారిన సినీ పరిశ్రమకు చెందిన కళాకారులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ఈ మొత్తాలను వినియోగించనున్నారు. నాంది సినిమా హీరో అల్లరి నరేశ్‌, నిర్మాత సతీష్ వేగ్నేశలు కూడా తమ చిత్రానికి చెందిన 50 మంది సినీ కార్మికులకు ఒక్కొక్కరికి రూ. పది వేల చొప్పున విరాళం అందించనున్నట్లు ప్రకటించారు.

Similar News