అమిత్ షా రాజీనామాకు సోనియా డిమాండ్

Update: 2020-02-26 08:47 GMT

ఢిల్లీ ఘటనలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించారు. అల్లర్లలో పదుల సంఖ్యలో మరణించటం బాధాకరమన్నారు. ఈ దాడులను సోనియా ఖండించారు. మూడు రోజుల్లో 20 మంది అల్లర్లలో చనిపోవటం అత్యంత విచారకరమన్నారు. ఈ అల్లర్లకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు సీనయర్ నేతలతో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ అల్లర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని అన్నారు.

అల్లర్లను అదుపు చేయటంలో విఫలమైన హోం మంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి నేత కపిల్ మిశ్రా వ్యాఖ్యలు అల్లర్లను పెంచేందుకు కారణం అయ్యాయని..పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ అల్లర్లకు పాల్పడినట్లు స్పష్టం అవుతోందని అన్నారు. ఢిల్లీ పరిణామాలపై సోనియాగాంధీ అంతకు ముందు పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. సకాలంలో అల్లర్లు జరుగుతున్న ప్రాంతంలో పోలీసులను మొహరించటంలో విఫలమయ్యారని విమర్శించారు.

 

 

Similar News