‘సామజవరగమన’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

Update: 2020-02-16 11:44 GMT

అల..వైకుంఠపురములో సినిమాలోని ఈ పాట ఎన్ని రికార్డు బద్దలు కొట్టిందో తెలిసిందే. సినిమాకు ఓ రేంజ్ లో క్రేజ్ రావటానికి ఈ పాటే మొదటి కారణం అని చెప్పటం కూడా ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ పాట. ఈ సినిమాలో పాటలు అన్నీ సూపర్ సాంగ్సే అయినా...అందరి తొలి ఓటు మాత్రం దీనికే పడుతుంది.. ఈ పాట తర్వాత రాములో..రాములా నిలుస్తుంది. ఇఫ్పటివరకూ లిరికల్ సాంగ్ ను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఇఫ్పుడు ఫుల్ వీడియో సాంగ్ ను చూడొచ్చు.

చిత్ర యూనిట్ ఆదివారం నాడు ఈ ఫుల్ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. అల్లు అర్జున్, పూజా హెగ్డెలు విదేశీ లొకేషన్లలో ఈ పాట కోసం వేసిన స్టెప్పులు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. మరి ఈ వీడియో సాంగ్ ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=OCg6BWlAXSw

Similar News