ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా

Update: 2020-02-05 11:59 GMT

కొత్త విడుదల తేదీ 2021 జనవరి8

దర్శక దిగ్గజం రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్‘ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తన తొలి ప్రెస్ మీట్ లోనే సినిమా విడుదల తేదీ 2020 జూలైగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు అదే నిజం అయింది. ఇప్పుడు చిత్ర యూనిట్ కొత్త తేదీని వెల్లడించింది. దీని ప్రకారం సినిమా 2021 జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులకు మరింత మెరుగైన మూవీని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఇది సినీ అభిమానులను నిరాశపర్చుతుందని తెలుసని..అయితే సినిమా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తామని ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

 

Similar News