జగన్ సర్కారుపై పవన్ ఫైర్

Update: 2020-02-19 00:04 GMT

రైతుల విషయంలో జగన్ సర్కారు తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. మీరు చెప్పింది ఏమిటి..చేస్తుంది ఏమిటి అంటూ ప్రశ్నించారు. దాన్యం విక్రయించిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బు చెల్లిస్తామని చెప్పారని, కానీ పంట అమ్ముకుని వారాలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించడంలో విఫలం అవుతోందని విమర్శించారు.

ఎన్నికల సమయంలో రైతు సంక్షేమమంటూ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక బకాయిలు కూడా చెల్లించడంలేదని అన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు ఈరోజు వరకు రూ.2016 కోట్లు చెల్లించాల్సి ఉందనీ.. ఈ మొత్తం రోజురోజుకీ పెరుగుతూ వస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. ధాన్యం కొనుగోలుకు నిధుల కేటాయించారా..లేదా?. కేటాయిస్తే ఈ నిధులు ఎటుపోయాయి అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

 

 

Similar News