తెలంగాణ కుంభమేళాలో కెసీఆర్

Update: 2020-02-07 12:03 GMT

తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క..సారలమ్మ జాతరలో ముఖ్యమంత్రి కెసీఆర్ పాల్గొన్నారు. శుక్రవారం నాడు ఆయన వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దేవలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. గత కొన్ని రోజులుగా జాతరకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తదితరులు ఉన్నారు.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా గంటపాటు దర్శనాలు నిలిపివేయడంతో క్యూ లైన్లలో నిలబడ‍్డ భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్కను చిలకల గుట్ట నుంచి మేడారానికి తీసుకురాగా భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క గద్దెపై ఆసీనురాలైంది. ఈ జాతరలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

Similar News