దోచుకోవటానికి అమరావతిలో ఏమీలేదనే వైజాగ్ కు

Update: 2020-02-12 06:30 GMT

ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సర్కారుకు అమరావతిలో దోచుకోవటానికి ఏమీలేకనే వైజాగ్ కు రాజధాని మారుస్తోందని ఆరోపించారు. అంతకు మించి రాజధాని మార్పునకు మరో కారణం కన్పించటం లేదన్నారు. రాజధాని మార్పు విషయంలో బిజెపి పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. కన్నా బుధవారం నాడు రాజధాని అమరావతి రైతులతో సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు తాయిలాలు ఇఛ్చి ప్రభుత్వం దోపిడీకి ప్లాన్ చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం రావణకాష్టంలా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరస పెట్టి ఆర్టీసీ, విద్యుత్, పెట్రో ఛార్జీలను పెంచి ప్రజల రక్తం పీలుస్తున్నారని ధ్వజమెత్తారు. వైజాగ్ ప్రజలు ఏమీ రాజధాని కావాలని కోరుకోవటంలేదన్నారు.

 

Similar News