శ్రీనివాస్ నివాసంలో ముగిసిన సోదాలు

Update: 2020-02-10 11:52 GMT

ఎట్టకేలకు చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంలో ఐటి సోదాలు ముగిశాయి. ఏకంగా ఐదు రోజుల పాటు ఈ సోదాలు సాగటం విశేషం. సహజంగా కార్పొరేట్ కంపెనీల్లో జరిగే సోదాలే ఒకట్రెండు రోజుల్లో ముగుస్తాయి...అలాంటిది ఓ మాజీ సీఎం పీఎస్ ఇంట్లో ఐదు రోజుల పాటు సోదాలు జరపాల్సినంత ‘మెటీరియల్’ అక్కడ ఉందా?. లేక ఆయన నుంచి ఇతర సమాచారం సేకరించేందుకే అక్కడ ఇన్ని రోజులు అధికారులు మకాం వేసి ఉన్నారా? అన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. అయితే శ్రీనివాస్ నివాసంలో జరిగిన సోదాల సారాంశం ఏమిటి అనేది ఐటి శాఖ అధికారికంగా స్పందిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు.

Similar News