విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం నాట సంఘటనలపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడానికి చంద్రబాబే కారణమన్నారు. నిన్నటి ఘటన కంటే.. గతంలో టీడీపీ దారుణంగా వ్యవహరించిందని విమర్శించారు. రాష్ట్రాన్ని వైసీపీ, టీడీపీ భ్రష్టు పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. అయినా చంద్రబాబుపై కోడిగుడ్లు వేయడం మంచి సంస్కృతి కాదన్నారు.
టీడీపీ హయాంలో ఏపీలోకి కేంద్రం రావొద్దన్నది చంద్రబాబు కాదా?, రాజధానిలో రైతుల సమస్యలను పరిష్కరించకుండా స్థలాలు ఎలా పంచుతారు? అని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలుస్తామని వెల్లడించారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనే ఉందని మరోసారి తేల్చిచెప్పారు. రాజధానిపై కేంద్రం వైఖరినే చెప్పానన్నారు. ప్రజలను మభ్యపెట్టడం సరికాదని జీవీఎల్ హితవు పలికారు.