ఆగని కరోనా కలకలం

Update: 2020-02-10 04:14 GMT

చైనాను కరోనా కలకలం వీడటంలేదు. చైనాతో పాటు పలు దేశాలకు కూడా ఈ వైరస్ విస్తరిస్తోంది. కాకపోతే చైనాలో ఉన్నంత తీవ్రత ఇతర దేశాల్లో లేదు. ఇప్పటికే ఒక్క చైనాలోనే ఈ వైరస్ బారిన పడి ఏకంగా 908 మంది మరణించారు. ఒక్క ఆదివారం నాడే ఈ మృతుల సంఖ్య 97 ఉందని వార్తలు వెలువడుతున్నాయి. అయితే అధికారికంగా బయటకు వచ్చే లెక్కలకు ..వాస్తవ మృతుల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇప్పటికే చైనాలో వైరస్ ఏకంగా 40 వేల మందికి సోకినట్లు సమాచారం. ఈ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ పోతోంది.

చైనాలో ఈ వైరస్ పుట్టిన హువాన్ కు ఇతర ప్రాంతాలతో అన్ని రకాల రవాణా సంబంధాలను కట్ చేశారు. అంతే కాదు...ఎవరూ ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదు..ఇళ్ళ నుంచే పనిచేయాలని అక్కడి కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. అయినా కూడా వైరస్ ఇంకా సోకుతూనే ఉంది. ఇప్పుడు ఇది ఒక్క చైనానే కాదు ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తోంది. చైనాకు దగ్గరగా ఉండే హాంకాంగ్ లో 36 మంది, మకావులో10కి, తైవాన్ లో 18 మందికి ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) రంగంలోకి దిగి చైనాకు ప్రత్యేక బృందాలను పంపనున్నట్లు ప్రకటించింది.

 

 

 

Similar News