ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ అక్రమం అంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భద్రతా పరికరాల కొనుగోలులో ఆయన పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. రాజకీయ ఒత్తిళ్ళతోనే తనను సస్పెండ్ చేశారని. గత ఏడాది మే 31 నుంచి తనకు వేతనం కూడా చెల్లించటం లేదని ఆతని పిటీషన్ లో పేర్కొన్నారు.
ఏ బీ వెంకటేశ్వరరావు పిటీషన్ ను క్యాట్ విచారణకు స్వీకరించింది. నిరాధార ఆరోపణలతో సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏ బీ వెంకటేశ్వరరావుపై ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. క్యాట్ లో ఆయనకు ఏ మేరకు ఊరట లభిస్తుందో వేచిచూడాల్సిందే. ఇటీవలే ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ పెండింగ్ జీతం పొందే అంశంతోపాటు అంశాల్లో ఊరట పొందారు.