ఆ పొత్తు ఫలితం తేలాలంటే నాలుగేళ్లు ఆగాల్సిందే

Update: 2020-01-16 05:53 GMT

జనసేన, బిజెపిల కలయికపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల వరకూ రెండు పార్టీలు ఉమ్మడిగా అనుసరించాల్సిన వ్యూహంపై భేటీ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో బలహీనంగా ఉన్న బిజెపి, జనసేనలు కలసి పోవాలనుకోవటం సహజమే అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆ రెండు పార్టీల పొత్తు వలన వచ్చే ఫలితం చూడాలంటే నాలుగున్నరేళ్లు ఆగాలని అన్నారు. వైసీపీ ఏపీలో చాలా బలంగా ఉందని, వారి పొత్తు వలన తమ పార్టీకి ఎటువంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. రెండు పార్టీల విధివిధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురువారం సాయంత్రంలోగా తెలుతుందని వ్యాఖ్యానించారు.

 

Similar News