చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటాం

Update: 2020-01-28 12:24 GMT

ఏపీలో అమరావతి వ్యవహారం కాక పుట్టిస్తూనే ఉంది. ప్రతిపక్ష టీడీపీ ఈ అంశంపై జెఏసీతో కలసి ఉద్యమాలు చేస్తుంటే..అధికార పార్టీ మూడు రాజధానుల నినాదాన్ని బలంగా విన్పిస్తోంది. ఈ తరుణంలో గుంటూరు జిల్లా తెనాలిలో బుధవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించనున్న సభపై.. వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబును తెనాలి పొలిమేరకు కూడా రానివ్వమని అన్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు.

తెనాలిలో 144 సెక్షన్‌ అమలులో ఉండగా సభ ఎలా పెడతారని ప్రశ్నించారు. చచ్చిన పార్టీని బతికించుకోవడం కోసం టీడీపీ జేఏసీ ముసుగేసుకుందని విమర్శించారు. జేఏసీ ముసుగులో రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని శివకుమార్ హెచ్చరించారు. సీఎం జగన్‌ దిష్టిబొమ్మలు తగలబెడితే చూస్తూ ఉండటానికి...తాము గౌతమబుద్దులం, మహాత్మాగాంధీలం కాదన్నారు. టీడీపీ ఎన్ని వేషాలు వేసినా పాతాళంలో ఉన్న పార్టీని పైకి తేలేరని అన్నారు.

 

Similar News