అమరావతిలో సోమవారం ఉదయం నుంచి టెన్షన్ టెన్షన్. ఎక్కడ నుంచి ఎవరు నిరసన చేస్తారో తెలియని పరిస్థితి. రాజధానిని అమరావతిలో కొనసాగించాలని కోరతూ జెఏసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గుంటూరులోని హోం మంత్రి సుచరిత ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించారు. ఇందులో మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.