ఏపీలో టీడీపీ, సీపీఐ నేతల అరెస్ట్ లు

Update: 2020-01-20 03:52 GMT

చలో అమరావతికి మద్దతు ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయా పార్టీల నేతలు అందరినీ హౌస్ అరెస్ట్ లు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ జెఏసీ సోమవారం నాడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది.

దీంతో పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏకంగా ప్రకాశం బ్యారేజ్ పై సామాన్య ప్రజలకు చెందిన వాహనాల, రాకపోకలను నియంత్రించారు. కేవలం అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుకు వెళ్ళేవారిని మాత్ర మే అనుమతిస్తున్నారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన కూడా చలో అసెంబ్లీకి మద్దతు ప్రకటించింది.

 

Similar News