రోజా ‘ముగ్గురు పిల్లల సిద్ధాంతం’

Update: 2020-01-20 05:00 GMT

చంద్రబాబు జోలె పట్టి అడుక్కుతింటున్నాడు

బిల్లులను ఆపటం చంద్రబాబు వల్ల కాదు

రాష్ట్ర విభజన సమయంలో అప్పుడు చంద్రబాబుది రెండు కళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రోజాది ముగ్గురు పిల్లల సిద్ధాంతం. రాష్ట్ర విభజన అంశంపై చంద్రబాబును అప్పట్లో ఏ ప్రశ్న అడిగినా తెలంగాణ, ఏపీ తనకు రెండు కళ్లు అంటూ సమాధానం దాటవేసేవారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రోజా కొత్తగా ‘ముగ్గురు పిల్లల సిద్ధాంతం’ తెరపైకి తీసుకొచ్చారు. ఏ తల్లి అయినా ముగ్గురు పిల్లలు ఉంటే అందరికీ సరైన తిండి, బట్టలు ఇవ్వాలని చూస్తుంది. సరైన అవకాశాలు కల్పించాలని చూస్తుంది. అంతే కానీ కొంత మందిని బాగా చూసి..మరికొంత మందిని మాడ్చదు కదా? అంటూ ఓ కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఈ ముగ్గురు పిల్లలు మొదటి నుంచి ఉన్నారు కదా?. కొత్తగా వచ్చారా వీళ్లలో ఎవరైనా?. సడన్ గా ముగ్గురి పిల్లలపై ప్రేమ ఎందుకొచ్చింది?. మొదటి నుంచి ఎందుకు లేదు? అన్నదే అసలు పాయింట్. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సోమవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలు...‘ చంద్రబాబు 20 గ్రామాలకు ప్రతిపక్ష నాయకుడా?. రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడా?. కూకట్ పల్లి నుంచి రౌడీలను తీసుకొచ్చి..ఉద్యమం పేరుతో రౌడీయిజం చేయాలని చూస్తున్నారు. చలో అసెంబ్లీ అంటాడు. ఒక తల్లి ముగ్గురు పిల్లలను సమానంగా చూస్తుంది. తిండి సమానంగా పెడుతుంది. జగన్మోహన్ రెడ్డి అందరికీ సమాన అవకాశాలు..సామాజిక న్యాయం చేయాలి అని ప్రయత్నిస్తున్నారు. పదేళ్లు హైదరాబాద్ రాజదానిగా అవకాశం కల్పిస్తే ఎందుకు చంద్రబాబు దొంగగా పారిపోయి వచ్చారు. ఎందుకు పర్మినెంట్ బిల్డింగ్ కట్టకుండా ఉన్నావు. రాజధాని ఈ ప్రాంతంలో లేకుండా చేసింది చంద్రబాబు కాదా?. లక్షా పది వేల కోట్ల రూపాయలు రాజధానికి కావాలని అన్నావు.

ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు ఉంటే చాలు అని చెబుతున్నావు. అంటే మిగతా అంతా అప్పట్లో నొక్కేద్దామని అనుకున్నావా?. లోకేష్ కు పప్పు అని ఊరికే పెట్టలేదు. నారాయణకు రాజధాని కట్టిన అనుభవం ఉందా? నారా లోకేష్ జీఎన్ రావు ఎవరు?. బోస్టర్ కమిటీ ఎవరూ అని ప్రశ్నిస్తున్నాడు. నారాయణ కాలేజీల్లో బాత్రూమ్ లు కూడా లేవు. పనికిమాలిన వాళ్లతో కమిటీ వేసింది మీరు. నిపుణులతో కమిటీ వేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మండలిలో ఒప్పుకోం..ఓడిస్తాం అనటం అంటే వీళ్ల అహంకారానికి పరాకాష్ట కాదా?. గత ఎన్నికల్లో మీ రాజధానికి రెఫరెండంగా కాదా ప్రజలు తీర్పు ఇఛ్చింది?. ఇంటికి ఫ్రిజ్, టీవీలు ఇచ్చినా మంగళగిరిలో లోకేష్ ను ఓడించారు కదా?. ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలంటే టీడీసీ చెందిన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లండి. చంద్రబాబునాయుడి ప్రతిపక్ష నాయకుడా?. పనికిమాలిన నాయకుడా? అన్న సందేహం వస్తుంది.

20 మంది ఎమ్మెల్యేలు 20 గ్రామాలు. ఇదేనా నీ రాజకీయం. మొన్న చూస్తే జోలె పట్టి అడుక్కుతింటున్నాడు. 40 ఏళ్ల కుర్రాడు వేసిన దెబ్బకు అడుక్కు తింటున్నాడు. ఎప్పుడూ గతంలో జోలె పట్టలేదు. ఎంత దిగజారిపోయాడు అంటే చంద్రబాబును ఇప్పుడు ఎవరినీ నమ్మే పరిస్థితలో లేరు. రాష్ట్రం బాగుపడాలన్నా..అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. చంద్రబాబు ప్రభుత్వంలో ఆడవాళ్లకు ఎలాంటి రక్షణ కల్పించారో అందరూ చూశారు. ఎంతో మంది ఆడవాళ్లను జీవితాలు నాశనం చేసిన చంద్రబాబుకు ఇప్పుడు నీతులు చెబుతున్నాడు. చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేసినా ఈ బిల్లును ఆపలేడు. ’ అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

 

Similar News