‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్ సాంగ్ విడుదల

Update: 2020-01-20 13:43 GMT

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ప్రేమికుల దినోత్సవం రోజున అంటే ఫిబ్రవరి 14న విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ పనుల వేగం పెంచింది. అందులో భాగంగా చిత్ర యూనిట్ సోమవారం నాడు తొలి లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది.

ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ మూవీలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్‌ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రాంతి కుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. తొలి విడతగా రిలీజ్ చేసిన పాట ‘మై లవ్’ సాంగ్ ను శ్రీక్రిష్ణ, రమ్య బెహరా ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

https://www.youtube.com/watch?v=jmeR4bwhOtA

Similar News