‘జాను’ టీజర్ విడుదల

Update: 2020-01-09 14:56 GMT

స్కూల్ లో చదువుకునే రోజుల్లో ప్రేమ. ఆ ప్రేమ అలా పెరిగి పెద్దది అవుతుంది. కానీ మధ్యలో ఎన్నో అవాంతరాలు. అలాంటి టీనేజ్ లవ్ స్టోరీలు తెలుగులో ఎన్నో వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి..ఉంటాయి. శర్వానంద్, సమంతల తాజా చిత్రం ‘జాను’. ఈ టీజర్ చూస్తుంటే అలాంటి ప్రేమకథే ఇది కూడా అని అర్ధం అవుతుంది. టీజర్ లో సన్నివేశాలు హర్ట్ టచింగ్ గా ఉన్నాయి. సమంత ఫోన్ లో ఎక్కడ అని అడగ్గా..నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడ అంటూ డైలాగ్ చెప్పటం...ఆ సమయంలో వీళ్లిద్దరూ చిన్నప్పటి స్కూల్ లో ఉన్న దృశ్యాలను చూపించటం హైలెట్ గా నిలుస్తుంది.

తమిళంలో వచ్చిన ‘96’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 96లో హీరోయిన్‌ చిన్ననాటి పాత్రలో కనిపించిన గౌరీ..జానులో కూడా అదే పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో ‘96’కు దర్శకత్వం, సంగీతం అందించిన ప్రేమ్‌కుమార్‌, గోవింద్‌ వసంత్‌లు.. ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=lNGLKCSyPbk&feature=emb_logo

 

 

Similar News