బాలకృష్ణ కనుసైగ చేస్తే బయట సుమోలు లేవవు

Update: 2020-01-31 12:23 GMT

టీడీపీ నేత, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్భాల్ స్పందించారు. బాలకృష్ణ కనుసైగ చేస్తే ఏమి అవుతుంది..సినిమాల్లోలాగా బయట సుమోలు పైకి లేవవని ఎద్దేవా చేశారు. బాలకృష్ణ తాను కనుసైగ చేస్తే ఏమయ్యేది అనడం ద్వారా ఆయన మానసిక స్థితి ఎలా ఉందో తెలియ జేస్తోందని ఇక్బాల్ అన్నారు.

గత 30 సంవత్సరాల నుంచి హిందూపురం బాలయ్య కుటుంబానికి పట్టం కడితే నియోజకవర్గ అబివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రైవేటు కార్యక్రమలకు సంవత్సరానికి రెండు, మూడు సార్లు వచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. బావ చంద్రబాబు అమరావతిని ఏటీఎంలా వాడుకుంటే బావమరిది బాలకృష్ణ హిందూపురాన్ని పేటీఎంలా వాడుకుంటున్నాడని ఆయన విమర్శించారు.

Similar News