‘ఎంత మంచివాడవురా’ మూవీ రివ్యూ

Update: 2020-01-15 07:02 GMT

ఎంత సంపద ఉన్నా ఇప్పటి వరకూ మార్కెట్లో దొరకనిది ఏదైనా ఉందీ అంటే..అది భావోద్వేగాలు పంచుకునేవారు. భావోద్వేగాలు పంచుకోవాలి అంటే వాళ్ళ మధ్య అంత ఎటాచ్ మెంట్ ఉండాలి లేదంటే కుటుంబ సభ్యులు అయినా అయి ఉండాలి. ఈ బిజీలో లైఫ్ లో..ఉద్యోగాల బిజీలో సొంత కుటుంబ సభ్యులనే పట్టించుకోని వారు ఉన్న సమాజం ఇది. తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉంచుతూ ఎవరికి వారు తమ జీవితాలను నడిపిస్తున్నారు. అలాంటిది ఓ యువకుడు తన స్నేహితులతో కలసి అవసరం అన్న వారికి కొడుకు, కూతురు, మనవడు, అన్న వంటి అనుబంధాల కోసం వారి వారి అవసరాలకు అనుగుణంగా మనుషులను సరఫరా చేస్తుంటాడు. దీని కోసం హీరో కళ్యాణ్ రామ్ ఓ కంపెనీ కూడా పెడతాడు. మరి అలా ఈ కంపెనీ సరఫరా చేసిన వాళ్లు నిజంగానే కోరుకున్న వాళ్లతో భావోద్వేగ సంబంధాలు ఏర్పడ్డాయా?. ఈ ప్రయోగం సక్సెస్ అయిందా?. అందులో వచ్చిన సమస్యలు ఏంటి అన్నదే సినిమా.

మంచి మనసు ఉంటే చాలు..భావోద్వేగాలు పంచుకోవటానికి బంధుత్వాలు అవసరం లేదు అనే లైన్ తీసుకుని దర్శకుడు సతీష్ వేగేశ్న సినిమాను తెరకెక్కించారు. ఈ లైన్ కొత్తగా ఉన్నా సినిమా తెరకెక్కించిన విధానం మాత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందనే చెప్పొచ్చు. హీరోకు చిన్నప్పటి నుంచి కుటుంబం, స్నేహితులే కాకుండా బంధువులతో కలసి ఉండాలనే మనస్తత్వం. తల్లిదండ్రులు ఉన్నంత వరకూ ఈ బంధుత్వాలు అన్నీ సాఫీగా సాగినా..ప్రమాదంలో హీరో తల్లిదండ్రులు చనిపోవటంతో బంధువులు అందరూ ఎక్కడ తమకు భారం అవుతాడో అని తప్పించుకుని పోతారు.

కానీ చిన్న నాటి స్నేహితురాలు మెహరీన్ మాత్రం కళ్యాణ్ రామ్ తో కలసి షార్ట్ ఫిల్మ్ లు తీసుకుంటూ తననే ప్రేమిస్తూ ఉంటుంది. సినిమా ఫస్టాఫ్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను చికాకు పెట్టిస్తాయి. హీరోయిన్ తండ్రిగా నటించిన నరేష్ మనసులోని మాటలు బయటకు చెబుతూ ప్రేక్షకులను నవ్విస్తాడు. నరేష్ తోపాటు వెన్నెల కిషోర్ కామెడీ కూడా ప్రేక్షకులను నవ్విస్తోంది. కళ్యాణ్ రామ్ తన పాత్రకు న్యాయం చేసినా కథతో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు లేకపోవటంతో సినిమా అంత భారంగా ముందుకెళుతుంది. యూట్యూబ్ ఛానళ్లలో వ్యూస్ కోసం కొంత మంది పెట్టే థంబ్ నెయిల్స్ పై జోకులు పేలతాయి. ఓవరాల్ గా చూస్తే ‘ఎంత మంచివాడవురా’ సినిమాలో సతీష్ వేగేశ్నమ్యాజిక్ మిస్ అయింది.

రేటింగ్.2 /5

 

 

Similar News