తెలుగుదేశం పార్టీ ఆలోచన..తన వ్యక్తిగత ఆలోచనల మధ్య తేడా ఉన్నందునే తాను శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశానని డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. అయితే శాసనమండలిని రద్దు చేయటం దురదృష్టకరం అని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల బాధలు దగ్గర నుంచి చూశానని..తాను వారికి అండగా ఉంటానని వ్యాఖ్యానించారు.
శాసనమండలి అనేది ఓ వ్యవస్థ అని..అక్కడ జరిగే పరిణామాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే సభకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. మిగిలిన విషయాలు అన్నీ త్వరలోనే బహిర్గతం అవుతాయని డొక్కా మాణిక్యవరప్రస్ద్ వ్యాఖ్యానించటం విశేషం. అవి ఏమై ఉంటాయి అన్నది వేచిచూడాల్సిందే. ఆయన రాజీనామా ఇంకా ఆమోదం పొందకపోయినా కూడా డొక్కా శాసనమండలి సమావేశాలకు దూరంగానే ఉన్నారు.