ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పిబ్రవరి 8న

Update: 2020-01-06 10:31 GMT

అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ సునీల్ అరోరా సోమవారం నాడు ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 22తో ముగియనుంది. ఢిల్లీలో ఒక కోటి నలభై ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జనవరి 14న ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. ప్రస్తుత ముఖ్యమంత్ర అరవింద్ కేజ్రీవాల్ ఎలాగైనా మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. చాలా మందు నుంచే వ్యూహాత్మకంగా పలు పథకాలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

విద్య, వైద్యం తదితర రంగాలకు సంబంధించి ఢిల్లీలో ఆప్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనదైన మార్క్ చూపించారని ప్రశంసలు అందుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా ఢిల్లీ పీఠంపై కన్నేసింది. అయితే ప్రధానంగా పోటీ ఆప్, బిజెపిల మధ్యే ఉండనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉన్నా ఆ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపించగలుగుతుంది అన్నది వేచిచూడాల్సిందే. అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో తీవ్ర రాజకీయ దుమారాల్లో కూరుకుపోయిన ఆప్ సర్కారు తర్వాత తర్వాత అంతా సరిదిద్దుకుని పాలనపై ఫోకస్ పెట్టి విజయం సాధించింది. మరి ఢిల్లీ ప్రజలు ఆప్ కు మరోసారి పట్టం కడతారా లేదా అన్నది వేచిచూడాల్సిందే.

 

Similar News