బిజెపి నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన కెసీఆర్ ఇప్పుడు జగన్ కు గురువు అయ్యారని విమర్శించారు. జగన్ పేరుకే ఏపీ సీఎం అని..నిర్మాత,స్ర్కీన్ ప్లే, డైరక్షన్ అంతా కెసీఆరే అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కంటే మెరుగైన పాలన అందిస్తారని ఏపీ ప్రజలు జగన్ కు ఓట్లు వేస్తే ఆయన మాత్రం తెలంగాణ సీఎం కెసీఆర్ ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్నారని విమర్శించారు.
కోతికి అద్దం ఇస్తే ఏమి చేయాలో తెలియక నేలకేసి కొట్టినట్లు జగన్ తీరు ఉందని విమర్శించారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురువారం నాడు అనంతపురంలో జరిగిన బిజెపి జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.