వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు చంద్రబాబు..యనమల

Update: 2020-01-26 11:46 GMT

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మండలితో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణలు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు అని ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను ఎలా కొన్నారో చూశామని, ఓటుకు నోటు కేసులో ఎలా దొరికిపోయాడో చూశామని అన్నారు. అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన శాసనసభ బిల్లు ఆమోదించి పంపితే శాసన మండలిలో అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకోవడాన్ని బొత్స తప్పుబట్టారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలి అవసరమా అనే చర్చ రాష్ట్రమంతా జరుగుతోందన్నారు.

శాసన మండలి నిబంధనలకు తూట్లు పొడిచిందని బొత్స చెప్పారు. కొందరు రాజకీయ లబ్ది కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం 5 కోట్ల మంది లబ్ది కోసం పని చేస్తోందన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలకు రూ.5కోట్లు, రూ.10కోట్లు ఎందుకిస్తాం.? వాళ్లేమైనా ప్రజా ఆమోదం ఉన్న నేతలా..? చేతిలో మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఎలా? అని బొత్స ఈనాడుపై విమర్శలు చేశారు. మండలి రద్దయితే లోకేశ్ పదవి పోతుందని చంద్రబాబు భయపడుతున్నారని, ఎందుకంటే లోకేశ్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడని అన్నారు. స్వార్థ ప్రయోజనాలే తప్ప చంద్రబాబుకు ప్రజా ప్రయోజనాలు పట్టవని బొత్స అన్నారు.

 

 

Similar News