‘సారు మస్తుంది నీ జోరు..గేరు మార్చింది నీలో హుషారు. డోరు తీసిందిలే పోరి ప్యార్ మోటార్ కారు. బొగ్గు గనిలో రంగు మణిరా.చమక్కు మందిరా..చిక్కినది రా..దక్కింది రా నీకే..కన్నె మోహిని సితార అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. బొగ్గు గనులు..గ్రామీణప్రాంతాల్లోనే ఈ పాట చిత్రీకరణ సాగింది. ఇందులో విజయ్ దేవరకొండ, క్యాథరిన్ థ్రెసా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఫిబ్రవరి14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ వరస పెట్టి పాటలు విడుదల చేసుకుంటూ వెళుతోంది.
https://www.youtube.com/watch?v=3hMl6Z_sv_A