సహజంగా రామ్ గోపాల్ వర్మ సినిమాల చుట్టూ వివాదాలు ఉంటాయి. అయితే ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమా ‘బ్యూటీఫుల్’ మాత్రం ఎలాంటి వివాదాలు లేకుండా నూతన సంవత్సరం తొలి రోజు కూల్ థియేటర్లలోకి వచ్చేసింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అంతా ప్రధానంగా రెండు క్యారెక్టర్ల చుట్టూనే తిరుగుతుంటుంది. వాళ్లే పార్ధు సూరి, నైనా గంగూలీ. ఇద్దరూ ముంబయ్ మురికివాడల్లో నివసిస్తూ కాలం గడుపుతుంటారు. ఇద్దరి మధ్య ఎంతో గాఢమైన ప్రేమ ఉంటుంది. మనకు ఉన్నదాంట్లో హాయిగా జీవితం సాగించాలనేది హీరోయిన్ నైనా గంగూలీది ధోరణి. సూరి మాత్రం తన లక్ష్యాలను అందుకుని ముందుకు పోవాలనే మొండితనం. అయితే ఈ లక్ష్యం చేరుకోవటానికి తన ప్రేమికురాలి సాయం తప్ప ఎవరి దగ్గర అయినా సాయం తీసుకోవటానికి సిద్ధపడతాడు. ఓ సారి హీరో, హీరోయిన్లు ఇద్దరూ ముంబయ్ బీచ్ లో సరదాగా గడిపే సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు చూసి హీరోయిన్ గా ఛాన్స్ దక్కుతుంది నైనాకు. అయితే సినిమాల్లో వెళ్ళటానికి నైనా ఏ మాత్రం ఆసక్తిచూపకపోయినా సూరి ఒత్తిడితోనే వెళుతుంది. దీంతో ఆమె లైఫ్ స్టైల్ మారిపోతుంది.
తన ప్రేమికుడిని ఎప్పటిలాగానే చూస్తున్నా..మధ్యలో మేనేజర్ మాత్రం వీరి మధ్య దూరం పెంచటానికి ప్రయత్నించి సక్సెస్ అవుతాడు. సూరి విధానం ఎలా ఉంటుంది అంటే కనీసం పానీ పూరి తిని కూడా ఆ బిల్లు అమ్మాయితో కట్టించడానికి ఇష్టపడడు. అంత మొండిగా ఉంటాడు. తన ప్రేమికురాలి సాయం ఏ మాత్రం తీసుకోకుండా జీవితంలో స్థిరపడాలనే తపనతో ప్రయత్నించే పాత్రలో తొలి సినిమా అయినా పార్ధు సూరి తన పాత్రలో మెప్పించాడు. ఇక హీరోయిన్ నైనా గంగూలీ మాత్రం గ్లామర్ షోలో ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. రంగీలాకు ట్రిబ్యూట్ అంటూ తెరకెక్కించిన ఈ సినిమాలో అచ్చం రంగీలా సినిమాలో ఊర్మిల తరహాలోనే నైనాతో ఎక్స్ పోజ్ ఓ రేంజ్ లో చేయించాడు దర్శకుడు ఆగస్త్య మంజు. ఈ సినిమా చూస్తే కేవలం యూత్ ను టార్గెట్ చేసుకుని సినిమాను తెరకెక్కించినట్లు కన్పిస్తోంది. ఓవరాల్ గా చూస్తే ‘బ్యూటిఫుల్’ అందాల అరబోత చూడాలనుకునేవారికి మాత్రమే.
రేటింగ్.2.25/5