వైసీపీపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-01-31 07:06 GMT

టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తన మౌనాన్ని చేతకాని తనం అనుకోవద్దని హెచ్చరించారు. ‘నేను ఒక్క సైగ చేస్తే నిన్న ఏమయ్యేది. నా వెనక మందల మంది ఉన్నారు. చట్టంపై గౌరవం ఉంది కాబట్టే మౌనంగా ఉన్నా. కక్ష సాధింపులతో రాష్ట్రం వెనక్కి పోతుంది. దేశంలో ఎక్కడైనా ఒక్క రాజధాని ఉంటుంది. కానీ మూడు రాజధానులు ఏంటో?. తండ్రి మండలిని పునరుద్ధరిస్తే..కొడుకు దాన్ని రద్దు చేస్తున్నాడు’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం బాలకృష్ణ గురువారం నాడు హిందూపురం పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం నాడు వైసీపీ కార్యకర్తలు కొంత మంది బాలకృష్ణకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించి..రాయలసీమ ద్రోహి..మూడు రాజధానులను వ్యతిరేకిస్తే రాష్ట్రానికి ద్రోహం చేసినట్లే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా..పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి బాలకృష్ణ పర్యటనకు లైన్ క్లియర్ చేశారు. నిన్నటి ఘటనపై బాలకృష్ణ శుక్రవారం నాడు స్పందించారు.

 

 

 

Similar News