‘లీడర్ శ్రీను’గా విజయ దేవరకొండ

Update: 2019-12-14 13:33 GMT

‘వరల్డ్ ఫేమస్’ లవర్ సినిమాకు సంబంధించి ఒక్కో హీరోయిన్..ఒక్కో క్యారెక్టర్ ను రివీల్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇఫ్పటికే ఐశ్వర్యరాజేష్ తోపాటు బ్రెజిల్ మోడల్ ఇజబెల్లా లెట్చి క్యారెక్టరతో కూడిన ఫోటోలను విడుదల చేశారు. తాజాగా అంటే శనివారం నాడు లీడర్ శ్రీను ‘బొగ్గుగనిలో బంగారం’ అంటూ విజయదేవరకొండను స్మితా మేడంతో కలిపి పరిచయం చేశాడు.

ఈ స్మితా మేడమే క్యాథరిన్ థ్రెసా. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లతో విజయ్ సందడి చేయనున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. సినిమా టీజర్ జనవరి 3న విడుదల కానుంది.

 

 

 

 

 

Similar News